Advertisementt

ఆఖరి అరగంట, ఎన్టీయార్ కేకంట!

Fri 08th Jan 2016 05:52 PM
nannaku prematho,junior ntr,nannaku prematho climax  ఆఖరి అరగంట, ఎన్టీయార్ కేకంట!
ఆఖరి అరగంట, ఎన్టీయార్ కేకంట!
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీయార్ సినిమా అంటేనే ఆసక్తికి కొదవ లేదు. మరి సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీయార్ అంటే ఇక జనాల ఉత్సూకతకు, అంచనాలకు ఆకాశమే హద్దు. అందుకే నాన్నకు ప్రేమతో చిత్రంలోని హై లైట్స్ ఏవీ బయటకు పొక్కనీయకుండా సుకుమార్ చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఆడియో వేడుక వరకు కనీసం కథాంశం ఏమిటన్నది కూడా చెప్పకుండా దాచిపెట్టి అటు తరువాత అందరి మనసునూ దోచుకున్నాడు. తండ్రి, కొడుకులుగా రాజేంద్ర ప్రసాద్, జూనియర్ ఎన్టీయార్ల  మధ్య వచ్చే సీన్లు అలాగే కథానాయకుడు, ప్రతినాయకుడు ఎన్టీయార్, జగపతి బాబుల మీద వచ్చే మైండ్ గేమ్ ఎపిసోడ్లు చాలా కొత్తగా ఉండబోతున్నాయట. అటు ఎమోషన్, ఇటు స్టైలిష్ ప్రెజెంటేషనుతో ఎన్టీయార్ అభిమానులకు సినిమాలో ఆఖరి అరగంట పీక్స్ టచ్ చేస్తుందన్నది ఇన్నర్ టాక్. ఈ పోర్షనులో తారక్ ప్రదర్శించిన నటన నభూతో నభవిష్యత్ అన్న రేంజులో ఉందట. సత్తా ఉన్న సీన్లు గనక ఎన్టీయార్ మీద వేస్తే, అతని నటనా ప్రతిభతో సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లగలడు. ఇప్పటి వరకైతే కేవలం తారక్ స్టైలిష్ లుక్స్ మీదే మొదటి దఫా పబ్లిసిటీ మొత్తం నెట్టుకొచ్చిన సుకుమార్ మరి ఇక్కడి నుండి బండిని ఎలా లాక్కొస్తాడో వేచి చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ