Advertisementt

పవన్ అభిమాని కాదు చిరంజీవి ఫ్యాన్!

Sat 09th Jan 2016 01:02 PM
shakalaka shankar,express raja,bheebhatsa nataraj  పవన్ అభిమాని కాదు చిరంజీవి ఫ్యాన్!
పవన్ అభిమాని కాదు చిరంజీవి ఫ్యాన్!
Advertisement
Ads by CJ

జబర్దస్త్ టీవీ షో ద్వారా సీకాకులం యాసను తెగ వాడేసుకుని బాగా పాపులర్ అయిన శకలక శంకర్ గత కొద్ది రోజులుగా సినిమాలలో దూసుకెల్తున్నాడు. హీరో పక్కన కనపడే కమెడియన్ పాత్రల్లో శంకర్ తన టైమింగ్ వాడుకొని ఫుల్ లెంత్ రోల్స్ కూడా పట్టేస్తున్నాడు. స్వతహాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన శంకర్ ఆ మధ్య జబర్దస్త్ షోలోని కొన్ని ఎపిసోడ్స్ ద్వారా పవన్ అభిమానులను ప్రసన్నం చేసుకున్నాడు. పవర్ స్టార్ మీద వేసిన భూకైలాస్ పేరడీ వాటిలో సూపరుగా క్లిక్ అయింది. ఇక అప్పటి నుండి శంకర్ అంటే చాలు పవన్ అభిమానులు నెత్తిన పెట్టేసుకుంటున్నారు. ఈసారి మాత్రం కొంచెం తెలివిగా పవన్ అభిమానిగా కాకుండా చిరంజీవి ఫ్యానుగా ఎక్స్ ప్రెస్ రాజా చిత్రం ద్వారా భీభత్స నటరాజ్ పాత్రలో మనలను అలరించనున్నాడు. పైన చూస్తున్న ఫోటోలో చిరంజీవి గెటప్ ఫుల్లుగా కాపీ కొట్టి ఓ నృత్య భంగిమలో శంకర్ అదరగొట్టేసాడు. శర్వానంద్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిల్చుంది. మరి శంకర్ చేయబోయే భీభత్సం ఏ స్థాయిలో ఉందో ఇంకో అయిదారు రోజులు ఆగితే గానీ తెలీదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ