'డిక్టేటర్' రికార్డుల వేట మొదలైంది. తొలి రికార్డ్‌తోనే టాలీవుడ్ మొత్తం షేకయింది. 'డిక్టేటర్' తొలి టికెట్‌ని అమెరికాలో వేలం పాటలో ఏకంగా 5,555 డాలర్లకు కొనుగోలు చేశాడు ఓ అభిమాని, అంటే మన లెక్కల ప్రకారం మూడున్నర లక్షల పైమాటే. అగ్ర కథానాయకుల చిత్రాలు విడుదల అవుతున్నప్పుడు ఇలా వేలం పాట నిర్వహిస్తుంటారు. గతంలో 'లెజెండ్' సినిమా టికెట్ ధర 50వేలు పలికింది. దానికి ఈ సరికొత్త రికార్డ్ అందనంత ఎత్తులో నిలిచింది. ఈనెల 14న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 800ల థియేటర్లలో విడుదల చేయనున్నారు. 13వ తేదీ అర్థరాత్రి వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో బెనిఫిట్ షోలు నిర్వహించాలని చిత్ర బృందం ప్రయత్నాలు షూరూ చేసింది.