Advertisementt

రజనీని పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పుతున్నారు..!

Tue 12th Jan 2016 03:19 PM
rajinikanth,shankar,robo2 movie,bolivia schedule  రజనీని పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పుతున్నారు..!
రజనీని పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పుతున్నారు..!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆయనతో పాటు శంకర్‌, ఇతర 'రోబో2.0' యూనిట్‌ మొత్తం పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది. తనపై కేసులు లేవని క్లీన్‌ చిట్‌ తెచ్చుకోవడం, పోలీస్‌ క్లియరెన్స్‌ కోసం రజనీతో సహా అందరూ పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ కోసమే ఈ తిప్పలన్నీ. 'రోబో2.0' చిత్రం నెక్స్స్‌ షెడ్యూల్‌ను శంకర్‌ బొలోవియాలో ప్లాన్‌ చేశాడు. అక్కడ కీలక సన్నివేశాలను తీయనున్నాడు శంకర్‌. అక్కడకు ఎవరు వెళ్లాలన్నా ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవనే క్లియరెన్స్‌ చాలా ముఖ్యం. ఆ సర్టిఫికేట్‌ లేనిదే బొలోవియాకి వెళ్లడం వీలుకాదు. అందుకే వీరందరూ చెన్నై పోలీస్‌ కమీషనర్‌ చుట్టూ తిరుగుతున్నారు. మరి వీరికి క్లియరెన్స్‌ సర్టిఫికేట్లు ఎప్పుడు వస్తాయో? చూడాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ