భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచు అంటే మస్త్ మస్త్ మజాగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ఆన్ని పోటీల్లో కన్నా వీరిద్దరి మధ్య క్రికెట్ అంటేనే నరాలు చిట్లే ఉత్కంట. దీనికి కారణం కూడా లేకపోలేదు. భూలోకం మీదున్న అత్యంత ప్రతిభావంతులైన క్రికెట్ క్రీడాకారులు ఇరు జట్లలో ఉండడమే. ఇక ఆస్ట్రేలియా గడ్డ మీద ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన టీం ఇండియా ఈరోజు జరిగిన మొదటి వన్ డే మ్యాచులో గెలుపు ముంగిట బొక్కబోర్లా పడింది. పెర్త్ నగరంలో ఈరోజు భారత్ బ్యాటింగ్ ఆర్డర్ వీర లెవెల్లో రెచ్చిపోయి 309 పరుగులు ప్రత్యర్థి ముందు ఉంచినా మళ్ళీ ఓటమిని మూటగట్టుకోవడం మన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. రోహిత్ శర్మ, బెయిలీ, స్మిత్ ముగ్గురూ శతక్కొట్టారు. కంగారూలతో మ్యాచ్ అంటేనే మనాళ్ళు ఓడిపోతారేమో అని ఫోబియాతో భయపడిన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికి అది నిజమవడంతో రానున్న రోజుల్లో మిగతా మ్యాచులలో ఎటువంటి ఫలితాలను చూడాల్సి వస్తుందో అనే కలవరం కూడా పట్టుకుంది.