Advertisementt

రామ్ కు మరో హిట్ ఇస్తాడా..?

Wed 13th Jan 2016 08:53 PM
ram,nenu sailaja movie,kishore thirumala,sravanthi movies  రామ్ కు మరో హిట్ ఇస్తాడా..?
రామ్ కు మరో హిట్ ఇస్తాడా..?
Advertisement
Ads by CJ

ఒకసారి తమతో హిట్‌ కొట్టిన డైరెక్టర్‌తో పనిచేయడం హీరోలకు ఎప్పుడూ హ్యాపీనే. అంతేకాదు... బిజినెస్‌పరంగానూ అది మంచి స్ట్రాటర్జీనే అని చెప్పాలి. నాలుగేళ్లుగా సరైన హిట్‌లేని హీరో రామ్‌కు ఎట్టకేలకు రీసెంట్‌గా వచ్చిన 'నేను...శైలజ' మంచి హిట్టును అందించింది. ఈచిత్రంతో రామ్‌ మరలా ఫామ్‌లోకి వచ్చాడు. కాగా ఆయన తన తదుపరి చిత్రాన్ని కూడా 'నేను..శైలజ' డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల దర్శకత్వంలోనే చేయనున్నాడని సమాచారం. 'నేను..శైలజ' షూటింగ్‌లో ఉన్నప్పుడే కిషోర్‌ తిరుమల రామ్‌కు మరో స్టోరీలైన్‌ వినిపించాడట. ఈ స్టోరీలైన్‌ రామ్‌కు బాగా నచ్చడంతో ఆ స్క్రిప్ట్‌పై వర్క్‌ చేయమని కిషోర్‌ తిరుమలకు చెప్పి, తనతోనే ఈచిత్రం చేస్తానని మాట ఇచ్చాడని సమాచారం. అంతేకాదు...ఈ చిత్రాన్ని తమ సొంత బేనర్‌ అయిన స్రవంతి మూవీస్‌పై నిర్మించే ఉద్దేశ్యంతో ఆయన కిషోర్‌ తిరుమలకు అడ్వాన్స్‌ కూడా ఇప్పించినట్లు తెలుస్తోంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ స్టోరీ ఉంటుందని, ఇప్పుడు కిషోర్‌ తిరుమల ఈ స్క్రిప్ట్‌ వర్క్‌లోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నాడని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ