Advertisementt

ఈ కళ్యాణం ఇద్దరికీ కీలకమే!

Sat 16th Jan 2016 05:44 PM
kalyana vaibhogame movie,naga shaurya,nandini reddy,malavika nair,kalyana vaibhogame movie censor report  ఈ కళ్యాణం ఇద్దరికీ కీలకమే!
ఈ కళ్యాణం ఇద్దరికీ కీలకమే!
Advertisement
Ads by CJ

'అలామొదలైంది' వంటి సూపర్‌హిట్టుతో కెరీర్‌ను ప్రారంభించిన మహిళా దర్శకురాలు నందినిరెడ్డికి తర్వాత చిత్రం 'జబర్దస్త్‌' తీవ్రంగా నిరాశకు గురిచేసింది. ఇక హీరో నాగశౌర్య పరిస్థితి కూడా అదే. తన చిత్రం 'ఊహలు గుసగుసలాడే' హిట్టు అయినప్పటికీ ఆ తర్వాత కనీసం యావరేజ్‌ చిత్రం కూడా దక్కలేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'కళ్యాణవైభోగమే'. ఇందులో 'ఎవడేసుబ్రమణ్యం' ఫేమ్‌ మాళవికనాయర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డ్‌ సింగిల్‌ కట్‌ కూడ లేకుండా 'క్లీన్‌యు' సర్టిఫికేట్‌ను ఇచ్చింది. దీంతో ఈ చిత్ర యూనిట్‌ ఎంతో ఆనందంతో ఉంది. కాగా ఈచిత్రాన్ని ఈనెల 21 లేదా 22 తేదీలలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రం దర్శకురాలు నందినిరెడ్డికి, హీరో నాగశౌర్యకి ఎంతో కీలకంగా మారింది. మరి ఈ చిత్రం వారికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ