పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా, బాబి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్‌గా శరత్‌మరార్ నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ఈరోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్'. ఈ చిత్రానికి సంబంధించిన చిన్న టీజర్ కూడా పవన్ అభిమానులను ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కాగా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం రెండో టీజర్ కేక పుట్టిస్తోంది. వాస్తవానికి మొదటి టీజర్, తాజాగా విడుదల చేసిన టీజర్ రెండు ఒకే విధంగా ఉన్నప్పటికీ బ్యాగ్రౌండ్ మారింది. లుంగీ కట్టి, ఒక చేత్తో తుపాకి పట్టి, ఖాకీ చొక్కా వేసి గుర్రంతో నడిచి వస్తున్న పవన్ గెటప్ మాత్రం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రంలో పవన్ డైలాగ్ ఒక్కటైనా ఉంటుందని ఎంతగానో ఎదురుచూసిన పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు. మరి పవన్ నోటి మాట వినాలంటే మరెంతకాలం వెయిట్ చేయాలో ఏమో?