Advertisementt

చిన్నహీరోలే..కానీ వాళ్ళే స్టార్లు..!

Sat 16th Jan 2016 07:05 PM
star heroes,small heroes,raj tarun,sharwanand,nani,nithin,super hit movies  చిన్నహీరోలే..కానీ వాళ్ళే స్టార్లు..!
చిన్నహీరోలే..కానీ వాళ్ళే స్టార్లు..!
Advertisement
Ads by CJ

మర్రిచెట్టు నీడలో చిన్నచిన్న మొక్కలు ఎదగవు అనే పామెతను తిరిగి రాస్తున్నారు మన చిన్నహీరోలు. తమదైన శైలిలో చిత్రాలు చేస్తూ ఒక్కో మెట్టు పైకెక్కుతూ తమ ఇమేజ్‌ను పెంచుకుంటున్నారు. ఇప్పటికే 'భలే భలే మగాడివోయ్‌' చిత్రంతో 20కోట్ల రేంజ్‌కు చేరుకున్న నాని నేచురల్‌ స్టార్‌గా ఎదుగుతున్నాడు. తాజాగా ఆయన నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరి ఈ చిత్రం కూడ సక్సెస్‌ అయితే ఇక నానిని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. మరోవైపు 'రన్‌రాజా రన్‌, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' చిత్రాలతో వరుసగా రెండు హిట్లు కొట్టిన యువహీరో శర్వానంద్‌ 'ఎక్స్‌ప్రెస్‌రాజా'తో మంచి హిట్టు కొట్టి హ్యాట్రిక్‌ పూర్తి చేశాడు. ఈ యంగ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌కు మరో రెండు మూడు హిట్లు పడ్డాయంటే స్టార్‌గా ఎదిగిపోవడం ఖాయం అంటున్నారు. ఇక రాజ్‌తరుణ్‌ ఇప్పటికే హ్యాట్రిక్‌ పూర్తి చేసుకొని రెండో హ్యాట్రిక్‌కు 'సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు' చిత్రంతో సిద్దమవుతున్నాడు. ఇక నితిన్‌ సైతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న 'అ..ఆ' చిత్రంతో తన మార్కెట్‌ను రెండింతలు చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. మొత్తానికి ఈ యువహీరోలు రాబోయే కాలంలో ఇతర స్టార్‌ హీరోలకు సరిసమానంగా దూసుకువెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ