టైం మెషీన్ లాంటి ఓ వినూత్నమైన ఆలోచనకు 1991లోనే దృశ్యరూపం ఇచ్చిన బాలకృష్ణ, సింగీతం శ్రీనివాస్ రావుగార్లు మరోసారి మన అందరినీ అదే టైం మెషీన్లో ఆదిత్య 369 పేరును కాస్త మార్చి ఆదిత్య 999 అంటూ కొత్త ప్రపంచంలోనికి తీసుకెళ్ళడానికి సమాయత్తమవుతున్నారు. ఇలాంటి కథలకు ఖర్చు ఎక్కువవుతుందన్న విషయం మనకు తెలిసిందే. సెట్ వర్క్, గ్రాఫిక్స్ లాంటివి విరివిగా వాడుకోవాలి కాబట్టి నిర్మాత ఎవరైనా నిర్మాణ విలువలకు గట్టిగా సొమ్ము పెట్టాల్సిందే. కానీ ఖర్చును మించి సినిమాను నిలబెట్టేది నటీనటులు. బాలకృష్ణ గారి గురించి తెలిసిన వారు ఎవరైనా ఇటువంటి కథకు ఇంకో హీరోను ఊహించుకోలేరు. కనక, హీ ఈజ్ ది బెస్ట్ చాయిస్. మరి బాలయ్య 100వ సినిమా కావడంతో నందమూరి ఫ్యామిలీలోని మిగతా హీరోలు జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ లాంటి వారితో స్పెషల్ అప్పియరెన్స్ ఇప్పిస్తే సినిమా స్కేలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ అన్న తరువాత మనస్పర్థలు ఉండడం సహజమే. అన్నీ మరిచిపోయి బాబాయికి ప్రేమతో అంటూ తారక్, కళ్యాణ్ రామ్ గనక ముందుకొస్తే ఆదిత్య 999కి వీరిని మించిన అట్రాక్షన్ ఏదీ ఉండకపోవచ్చు. ఎలాగో బాలయ్య గారబ్బాయి మోక్షజ్ఞ్యకు ఇది మొదటి చిత్రం అవనుంది. మరి సింగీతం గారు కొంచెం పోరాడితే ఆదిత్య 999కి తిరుగులేని స్టార్ చమక్కులు తోడవచ్చు.