తెలుగు సినిమా హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గతకొద్ది రోజులుగా సరైన సినిమా పడక అవస్థలు పడుతున్నారు. కారణం ఎంటబ్బా అని ఎక్కువగా ఆలోచించకుండా మళ్ళీ బ్రహ్మి ఫాంలోకి రావాలని కోరుకునేట్టుగా ఇదిగో ఇలాంటి స్టిల్ ఒకటి కనపడితే నవ్వకుండా ఉండగలమా. అదీ, అలాంటి ఇలాంటి స్టిల్ కాదాయె. సర్దార్ గబ్బర్ సింగ్ గెటప్పులో పవన్ కళ్యాణ్ ఎంత బాగా సూట్ అయ్యాడో తెలుసు కనక ఇప్పుడు అదే ఆహార్యం బ్రహ్మానందం వేస్తే కేకో కేక. ఏ సినిమా కోసం బ్రహ్మీ ఈ అవతారం ఎత్తారో తెలీదు గానీ చూసినోల్లు మాత్రం హీ ఈజ్ బ్యాక్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు అంతర్జాలం అంతటా ఈ బొమ్మే హల్ చల్ చేస్తోంది. గుర్రం బాగుంది, నిలబడ్డ స్టైల్ బాగుంది, బ్రహ్మానందం వేసుకున్న సర్దార్ స్పూఫ్ డ్రెస్ బాగుంది. అన్నీ కలిపి బ్రహ్మీ అదుర్స్. స్టార్ హీరోల ఇమిటేషన్ కొత్త కాకపోయినా చేయాల్సిన టైంలో చేయాల్సిన నటులు సరిగ్గా చేస్తే ఇటువంటి ఒక్క గెటప్పు చాలు, సినిమా ఫలితాన్ని మార్చేస్తుంది.