హన్సిక మోత్వాని, రాయ్ లక్ష్మి అండ్ ఆండ్రియా హీరోయిన్లుగా నటించిన హారర్ కామెడీ చంద్రకళ తెలుగులో విజయవంతం అయింది. అరణ్మనై పేరుతో తమిళంలో సుందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగునాట కూడా చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక అదే కథకు కొనసాగింపుగా అరణ్మనై 2ని తయారు చేసారు సుందర్. తెలుగులో హారర్ కామెడీలకు మరి డిమాండ్ ఎక్కువే కదాని చంద్రకళ 2ను కాస్తా కళావతిగా పేరు మార్చి మరోసారి ఇక్కడ దించబోతున్నారు. హన్సిక అలాగే ఉన్నప్పటికీ త్రిష మెయిన్ హీరోయినుగా, పూనం బాజ్వాతో కలిపి మళ్ళీ ముగ్గురు అందగత్తెల ఫార్ములాలోనే ఇది కూడా ఉండబోతోంది. కాకపోతే సిద్ధార్థ్ హీరో. ఈ నెలాఖరుకి చిత్రం రిలీజు ఉండనుంది. ప్రమోషన్లు కూడా మెల్లిగా మొదలయ్యాయి. త్రిషను ఇప్పటిదాకా వివిధ గ్లామర్ పాత్రలలలో తిలకించాం, అందుకే కాబోలు దెయ్యం కూడా ఇక్కడ కంటికి అందమైన దెయ్యంలా కనపడుతోంది. సుందర్ సినిమాల్లో హీరోయిన్ల గ్లామరుకు కొదవ ఉండదు. అందునా పక్కా ఫార్ములాను నమ్ముకున్న దర్శకుడాయే, ఇక ముగ్గురు భామలతో పసందైన దెయ్యం విందును నెలాఖరులో ఆరగించడానికి సిద్ధంకండి.