విక్రమ్ చిత్రంతో హీరోగా పరిచయమైన నాగార్జున హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కాలం పట్టింది. తొలిచిత్రంలో అతని నటన చూసి అందరూ పెదవి విరిచారు. ఏ విధంగానూ అతను హీరోగా పనికి రాడని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. కానీ, అదే నాగార్జున శివ, గీతాంజలి వంటి రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న క్యారెక్టర్స్ చేసి అందర్నీ మెప్పించాడు. ఎన్నో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేసి నటుడుగా ఎదిగాడు. అన్నమయ్య వంటి భక్తిరస చిత్రంలో అందర్నీ మైమరపించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత శ్రీరామదాసు, శిరిడిసాయి వంటి సినిమాలతో భక్తులను అలరించాడు. మీలో ఎవరు కోటీశ్వరుడుతో ఫ్యామిలీస్‌కి బాగా దగ్గరైన నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పిస్తున్నాడు. ప్రస్తుతం ఊపిరి చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటిస్తున్న నాగార్జున ఆ సినిమా తర్వాత కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో హాథీరాం బాబా పేరుతో రూపొందనున్న చిత్రంలో మరో ఉదాత్తమైన పాత్రను పోషించనున్నాడు.
ఈ సినిమాతో నాగార్జున తన కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తనకంటే తన ఇద్దరు కొడుకుల కెరీర్ ముఖ్యమని భావిస్తున్న నాగార్జున ఇకపై నాగచైతన్య, అఖిల్‌ల కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నాగచైతన్య వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అతనికి సాలిడ్ అనేది ఇప్పటివరకు రాలేదు. తన కెరీర్‌ని బిల్డప్ చేసుకోవడంలో నాగచైతన్యకి, అలాగే తన మొదటి సినిమాతోనే డిజాస్టర్‌ని టేస్ట్ చేసిన అఖిల్‌కి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని నాగ్ డిసైడ్ అయినట్టు తెలిసింది. అందుకే నాగార్జున ఇక కొత్త సినిమాల కమిట్‌మెంట్స్ పెట్టుకోవడం లేదట. రాఘవేంద్రరావుతో చేసే హాథీరాం బాబా తర్వాత ఆల్‌మోస్ట్ నాగార్జున తన కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నాడని సమాచారం.