చిరంజీవి గారు 150వ సినిమాగా తమిళ హిట్ కత్తిని రీమేక్ చేస్తున్నారంటేనే చాలామంది పెదవి విరిచారు. దీనికి కారణాలు ఏమిటో కత్తిని వీక్షించిన వారయితేనే సరిగ్గా చెప్పగలరు. అలాగని రీమేక్ చేయడం పూర్తిగా తప్పని వాదించిన వారు కూడా లేరనుకోండి. ఇంతకు మునుపు సైతం మెగాస్టార్ గారు బాలివుడ్ నుండి మున్నాభాయి రెండు చిత్రాలను, తమిళ రమణను టాగూరుగా రీమేక్ చేసి విజయం సాచించిన దాఖలాలు ఉన్నాయి. వాటన్నింటికీ ఇప్పుడు కత్తికి ఉన్న తేడా ఒక్కటే. అదే ఈ చిత్రం 150వది కావడం. పైగా దర్శకుడు వినాయక్ తాజాగా డిజాస్టర్ అఖిల్ నుండి బయటకు రావడం. ఏది ఏమైనా కత్తి కథలో ఒక స్వచ్చమైన మెసేజ్ సిన్సియారిటీ ఉంటుంది. కథలో కేవలం ఈ ఒక్క కోణం నచ్చే రీమేక్ ప్రతిపాదనను ఒప్పుకున్నారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. ముందస్తు సూచనగా సినిమా మొదట్లో వచ్చే రొమాంటిక్ ట్రాక్, కామెడీ మీద పెద్దగా దృష్టి సారించకుండా జీవానందం అనే అసలు హీరో పాత్రలో ఉన్న కమ్యూనిస్ట్ భావాలను, ప్రజలకు మంచి చేయాలన్న అతని తపననే కథనంలో హైలైట్ చేయమని, ఈ పోర్షన్లకు ఎటువంటి ఎకస్ట్రాలు జత చేయకుండా మురుగదాస్ రాసింది ఉన్నది ఉన్నట్లుగా తెలుగీకరించమని వినాయక్ అండ్ మిగతా టీముకి సంకేతాలు పంపారట చిరంజీవి.