దాదాపు పది సంవత్సరాలుగా హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష కెరీర్ జోడి చిత్రంలో సిమ్రాన్ ఫ్రెండ్స్‌లో ఒక ఫ్రెండ్‌గా నటించడం ద్వారా స్టార్ట్ అయిందన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తరుణ్ హీరోగా వచ్చిన నీమనసు నాకు తెలుసు చిత్రంతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది. తెలుగు, తమిళ భాషల్లో అందరు టాప్ హీరోలతో కలిసి నటించిన త్రిష ఈ రెండు భాషల్లో కాక కన్నడలో ఒక సినిమా, హిందీలో ఒక సినిమా మాత్రమే చేసింది. ప్రస్తుతం తమిళ్‌లో సూపర్‌హిట్ అయి తెలుగులో చంద్రకళగా రిలీజ్ అయిన చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న కళావతి చిత్రంలో టైటిల్ రోల్ చేస్తోంది త్రిష.
తన కెరీర్‌లో అన్నిరకాల క్యారెక్టర్స్ చేసిన త్రిష ఇప్పుడు మరో కొత్త క్యారెక్టర్ చేస్తోంది. ధనుష్ కొత్త సినిమాలో త్రిష నెగెటివ్ షేడ్స్ వున్న ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తోంది. కోడి పేరుతో ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. త్రిష క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా హైలైట్‌గా వుంటుందని సమాచారం. జనవరి 5న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసేందుకు వీలుగా చిత్రీకరణ జరుపుతున్నారని తెలుస్తోంది.