మనీ ఈజ్ ది అల్టిమేట్ గోల్ ఫర్ ఆల్ అన్నది అందరూ ఒప్పుకునే సామెతే. కానీ దర్శకుడు సుకుమార్ మాత్రం ఆయన సినిమాల్లో లాగానే కొంచెం కాంప్లెక్స్ పద్ధతిలో చెప్పుకొస్తున్నాడు. డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి. దర్శకుడు సినిమాలు తీసేది, నిర్మాతలు సొమ్ములు పోసేది, హీరోలు నటించేది, బయ్యర్లు కొన్నుకునేది... అన్నీ స్వలాభాల కోసమే కదా. మరి ఇన్ని లెక్కలున్న డబ్బు లెక్క ఏమిటో మన లెక్కల మాస్టారుకి తెలీదంటారా. డోంట్ చేజ్ ఫర్ మనీ, డబ్బుల వెనక పరుగెత్తకు. డబ్బే మన కోసం పరుగెత్తుకుంటూ రావాలి అని పరిశ్రమలోని ఓ పెద్ద మనిషెవరో సుకుమార్ గారికి సెలవిచ్చారట. డబ్బుకు సంబంధించి ఎప్పటికప్పుడు అవసరాలు మారుతుంటాయి కాబట్టి దాని గురించి ఎక్కువగా పట్టించుకోను అంటారు సుకుమార్. అందుకేనేమో మరి సొంత బ్యానర్ మీద సినిమాలన్నీ రాజ్ తరుణ్, సుమంత్ అశ్విన్ లాంటి చిన్న హీరోలతో బుల్లి బడ్జెట్ మీద తీసేసి పెక్కు లాభాలు గడిస్తూ, తాను దర్శకత్వం వహించే బయటి బ్యానర్ సినిమాలకు మాత్రం మహేష్ బాబు, జూనియర్ ఎన్టీయార్ హీరోలుగా 40, 50 కోట్లు నిర్మాతలతో పెట్టిస్తుంటారు.