Advertisementt

రానాకు మరో మంచి అవకాశం!

Fri 22nd Jan 2016 08:42 PM
daggubati rana,leader 2,sekhar kammula,suresh babu,rana  రానాకు మరో మంచి అవకాశం!
రానాకు మరో మంచి అవకాశం!
Advertisement
Ads by CJ

దగ్గుబాటి రానా మల్టీస్టారర్‌ చిత్రాలలో, గెస్ట్‌పాత్రలలో బిజీగా ఉంటున్నప్పటికీ ఇప్పటివరకు ఆయనకు సోలో హీరోగా హిట్‌ మాత్రం రాలేదు. కానీ ఆయనకు గెస్ట్‌పాత్రలు మాత్రం అన్ని భాషల నుండి వస్తున్నాయి. దీంతో ఎలాగైనా సోలో హీరోగా తనని తాను నిరూపించుకునేందుకు దగ్గుబాటి రానా, ఆయన తండ్రి సురేష్‌బాబులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా 'లీడర్‌' చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన రానా ఆ చిత్రంతోనే నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించినా కమర్షియల్‌గా హిట్‌ కాలేదు. కాగా ఆ చిత్ర దర్శకుడు శేఖర్‌కమ్ముల సైతం ప్రస్తుతం ఫామ్‌ కోల్పోయి ఉన్నాడు. దాంతో మరలా తనని తాను ప్రూవ్‌ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో 'లీడర్‌' స్టోరీకి కొనసాగింపుగా ఆయన ఓ కథను తయారుచేసుకున్నాడట. ఈ చిత్రం స్టోరీని ఆయన రానా, సురేష్‌బాబులకు వినిపించడంతో ఎంతో ఎగ్జైట్‌ అయిన తండ్రికొడుకులు ఈ చిత్రంలో రానా నటించడమే బెస్ట్‌ అనే నిర్ణయానికి కూడా వచ్చారట. కావాలంటే ఆ చిత్రాన్ని తన సొంత బేనర్‌ అయిన సురేష్‌ప్రొడక్షన్స్‌లో చేయడానికి కూడా సురేష్‌బాబు సిద్దంగా ఉన్నాడని సమాచారం. కానీ శేఖర్‌కమ్ముల మాత్రం  తానే నిర్మాతగా ఈ చిత్రాన్ని అంటే 'లీడర్‌ 2' చేయడానికి సంసిద్దమవుతున్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ