Advertisementt

చిన్న సినిమాలకు స్టార్స్ అండ..!

Sat 23rd Jan 2016 12:17 PM
mahesh babu,krishnagadi veeraprema gadha,prabhas,express raja  చిన్న సినిమాలకు స్టార్స్ అండ..!
చిన్న సినిమాలకు స్టార్స్ అండ..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ స్టార్స్‌ అయిన పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, ప్రభాస్‌, అల్లుఅర్జున్‌ తదితరులు చిన్న చిత్రాల ఆడియో ఫంక్షన్లకు హాజరై ఆయా సినిమాలకు మంచి క్రేజ్‌ రావడానికి కృషి చేస్తున్నారు. పవన్‌ అంటే నితిన్‌ సినిమాలకు ఓ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయాడు. ఆయన నటించిన చిత్రాల ఆడియోవేడుకలు అన్నింటికీ పవన్‌ రాకపోయినా ఆయా ఫంక్షన్లలో పవన్‌ నామజపం కంపల్సరీగా ఉంటుంది. ఇక తన బావ సుధీర్‌బాబు నటించే చిత్రాల ఆడియో వేడుకలకు మహేష్‌బాబు హాజరవుతూ వస్తున్నాడు. అంతే కాదు... నాని, అఖిల్‌ వంటి హీరోలు నటించిన చిత్రాలకు కూడా మహేష్‌ హాజరవుతున్నాడు. తాజాగా ఆయన నాని 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఆడియో వేడుకకు కూడా మహేష్‌ రావడంతో ఈ చిత్రానికి కూడా మంచి బిజినెస్‌ క్రేజ్‌ వస్తోంది. ఇక తన స్నేహితులైన యువి క్రియేషన్స్‌ బేనర్‌లో వచ్చే చిత్రాలకు ప్రబాస్‌ ముఖ్య అతిథిగా హాజరవుతుంటాడు. 'రన్‌రాజారన్‌, జిల్‌, ఎక్స్‌ప్రెస్‌రాజా'లతో పాటు ఇటీవల వచ్చిన మెగాహీరో వరుణ్‌తేజ్‌ 'లోఫర్‌' చిత్రానికి సైతం ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇక గీతాఆర్ట్స్‌ నిర్మించే చిన్న చిత్రాలకు, మరీ ముఖ్యంగా మారుతి దర్శకత్వం వహించే చిత్రాలకు కూడా ముఖ్యఅతిథిగా పాల్గొంటు వస్తున్నాడు అల్లుఅర్జున్‌. మరి ఇలా పెద్ద పెద్ద స్టార్స్‌ యువహీరోల చిత్రాలకు మంచి క్రేజ్‌ రావడంలో తమవంతు సాయం చేయడం గొప్పే కదా....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ