దాదాపు 8ఏళ్ల తర్వాత మరలా ఫుల్‌ప్లెడ్జ్‌డ్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి 'కత్తి' రీమేక్‌తో సినిమా చేయడం ఖాయం కావడంతో మెగాభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. కాగా ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన తమిళ 'రమణ'ను కూడా పలు మార్పులు చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా మలచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ 'కత్తి' విషయంలో కూడా చిరు, వినాయక్‌లు కలిసి చర్చించి పలు మార్పులు, చేర్పులను చేయడం జరిగిందని తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్‌లో హీరో విజయ్ ద్విపాత్రాభియం చేయగా, రెండు పాత్రల గెటప్‌లు ఒకే విధంగా ఉంటాయి. కానీ తెలుగులో మాత్రం చిరంజీవి ఒక పాత్రలో 'ఇంద్ర, అందరివాడు' చిత్రాల గెటప్‌ను గుర్తు తెస్తూ కోరమీసంతో కనిపించనున్న ఫొటోలు కూడా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇక రెండో పాత్రకు మమూలు గెటప్‌లోనే చిరు కనిపించనున్నాడు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో ఒక పాత్ర నాయకుడి పాత్ర కాగా, మరో పాత్ర దొంగ పాత్ర. నాయకుడి పాత్ర కోరమీసంతో కనిపిస్తే, దొంగ పాత్ర చిరు ఒరిజినల్ లుక్‌లోనే ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రం విషయంలో చిరు ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటున్నాడు.