సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలైనప్పటికీ దేనికీ డిజాస్టర్ టాక్ రాకపోవడం ఈ పండగ సీజన్ విశేషం. అయితే సంక్రాంతి విన్నర్‌గా నాగార్జున నిలవడం, సోగ్గాడే చిన్ని నాయనా నెంబర్ వన్ స్థానాన్ని దక్చించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధిస్తున్న చిత్రంగా సోగ్గాడే.. రికార్డ్ క్రియేట్ చేస్తోంది.
ఇదిలా వుంటే మిగతా హీరోలు సమ్మర్‌పైన కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నారు. ఏప్రిల్‌లోగానీ, మేలో గానీ పవన్‌కళ్యాణ్ సర్దార్ గబ్బర్‌సింగ్ రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ సరైనోడు ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది. నితిన్ సినిమా అఆ చిత్రాన్ని కూడా ఏప్రిల్‌లోనే రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ కొత్త సినిమా బ్రహ్మూెత్సవం కూడా ఏప్రిల్, మే నెలల్లోనే రిలీజ్ కానుంది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన నాగార్జున కార్తీతో కలిసి చేస్తున్న ఊపిరి పై నాలుగు చిత్రాల మధ్యలో రిలీజ్ అవుతోంది. దాదాపు ఒక నెల రోజుల వ్యవధిలో ఈ సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా కొత్త కాన్సెప్ట్‌లతో వస్తున్న చిన్న సినిమాలు కూడా నాలుగైదు వున్నాయి. అంటే దాదాపు సమ్మర్‌లో 10 నుంచి 12 సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఓ మోస్తరు సినిమాలు ప్రతివారం వుండనే వుంటాయి.
సమ్మర్‌లో తమ సినిమాలు రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు చేస్తున్న ప్లానింగ్ చూస్తుంటే మళ్ళీ తెలుగు సినిమాల మధ్య పోటీ తప్పదని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి విన్నర్‌గా నిలిచిన నాగార్జునతో సమ్మర్‌లో మిగతా హీరోలు పోటీ పడబోతున్నారు. మరి సమ్మర్ సీజన్‌లో విజయం ఎవరిని వరిస్తుందో వెయిట్ అండ్ సీ.