Advertisementt

అదీ ఎన్టీయార్, పవన్ మధ్య ఉన్న స్నేహం!

Mon 25th Jan 2016 07:45 AM
junior ntr,pawan kalyan friendship,nannaku prematho  అదీ ఎన్టీయార్, పవన్ మధ్య ఉన్న స్నేహం!
అదీ ఎన్టీయార్, పవన్ మధ్య ఉన్న స్నేహం!
Advertisement
Ads by CJ

బయట అభిమానుల గోల ఎలాగున్నా లోపల ఉండే స్టార్ హీరోలు మాత్రం వ్యక్తిగతంగా ఒకరి పట్ల ఇంకొకరికి ఉన్నతమైన స్నేహభావంతో మెలుగుతుంటారు. చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య ఒకానొక సమయంలో ప్రతీది చిచ్చుపెట్టె విషయం లాగానే ఉండేది. ఇప్పుడు కూడా హీరోల ఫ్యాన్స్ మధ్య వైరం తరచుగా వార్తల్లో నిలుస్తున్నా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీయార్ మాత్రం ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. వీరిద్దరూ కలిసి ఫోటోలు దిగిన సందర్భాలు చానా తక్కువే అయినా ఇదిగో ఇప్పుడు నాన్నకు ప్రేమతో చిత్రంలో కంటెంట్ తెలుసుకున్నప్పటి నుండీ ఆ సినిమా చూడడానికి పవన్ అమితాసక్తిని కనబరిచాడట. ఆ నోటా ఈ నోటా విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీయార్ వెంటనే మూడో కన్నుకు తెలియకుండా సుకుమార్ గారిని సంప్రదించి పవన్ కళ్యాణ్ కోసం ఓ స్పెషల్ షో వేయించాడని టాక్. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, ఎన్టీయార్ మధ్య వచ్చిన భావోద్వేగ సన్నివేశాలకు పవన్ కదలిపోయాడట. సినిమా అనంతరం ఇద్దరికీ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు, పవన్ అండ్ ఎన్టీయార్ మధ్య ఉన్న నిగూఢ స్నేహాన్ని చాటిచెప్పడానికి! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ