Advertisementt

మళ్ళీ చావు కబురుతో లేపారుగా!

Mon 25th Jan 2016 03:53 PM
kalpana,ms narayana wife ms kalaprapoorna  మళ్ళీ చావు కబురుతో లేపారుగా!
మళ్ళీ చావు కబురుతో లేపారుగా!
Advertisement
Ads by CJ

మరోసారి చావు కబురుతోనే తెలుగు సినిమా ప్రేక్షకులు ఉలిక్కి పడుతూ నిద్దర లేచారు. ఈసారి ఒక్కరు కాదు ఇద్దరు సినీ ప్రపంచానికి పరిచయం ఉన్న వ్యక్తులు కన్నుమూశారు. ఒకరు ప్రముఖ హాస్యనటుడు, దివంగత ఎమ్మెస్ నారాయణ గారి సతీమణి కళాప్రపూర్ణ గారయితే రెండో వారు సుప్రసిద్ధ దక్షినాది నటీమణి కల్పన. పాపం ఎమ్మెస్ కుటుంబానికి ఇది తీరని లోటు. ఎందుకంటే తండ్రి చనిపోయి సరిగ్గా ఏడాది తిరిగిందో లేదో వారి సంతానం విక్రమ్, శశికిరణ్ ఇప్పుడు తల్లిని కోల్పోయారు. ఎమ్మెస్ ఈ లోకం విడిచిన నాటి నుండీ కళాప్రపూర్ణ గారు మంచాన పడ్డారట. హృద్రోగంతో బాధ పడుతున్న తల్లిని ఇద్దరూ కంటికి రెప్పలా చూసుకున్నారు. కానీ చివరికి చావును తప్పించలేకపోయారు. అలాగే తమిళ, మళయాళ, తెలుగు చిత్రాల్లో నటీమణిగా పేరు పొందిన కల్పన గారు తీవ్రమైన గుండెనొప్పితో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఈ రోజు ప్రొద్దున్నే ప్రాణాలు వదిలారు. కల్పన చెల్లెలు ఊర్వశి కూడా నటిగా సుపరిచయం. తమిళంలో భాగ్యరాజా గారి చిన్నవీడుతో తెరకు పరిచయం అయిన కల్పన గారి ఆఖరి సినిమా తమిళ చార్లీ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ