సినిమా సినిమాకి మధ్య వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకోవడమే కాదు.. ఆయా చిత్రాలలో తమ లుక్స్‌పరంగా కూడా వెరైటీగా కనిపించి, మేకోవర్‌పై మన హీరోలు ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నారు. 'బాహుబలి' కోసం ప్రభాస్, రానాలు తీవ్ర కసరత్తులు చేసి బరువు పెరిగి తమ లుక్‌ను మార్చుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రం రెండో పార్ట్ కోసం కూడా ఇప్పుడు అదేవిధంగా మారిపోయారు వీరిద్దరు. ఇక తాజాగా వచ్చిన ఎన్టీఆర్ చిత్రం 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో ఎన్టీఆర్ గడ్డంతో పాటు వెరైటీ హెయిర్‌స్టైల్‌తో కనిపించి అభిమానులను అలరించాడు. ఈ గెటప్‌కు ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన లభిస్తోంది. ఇక 'సరైనోడు' చిత్రం కోసం బన్నీ మొదటిసారిగా కోరమీసాలతో కనిపించనున్నాడని సమాచారం. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం కోసం మరలా 'ఇంద్ర, అందరివాడు' వంటి సినిమాలలో లాగా ఓ పాత్ర కోసం మీసం తిప్పిన సరికొత్త గెటప్‌తో కనిపించనున్నాడు. ఇక మరో మెగాహీరో వరుణ్‌తేజ్ తన తాజా చిత్రం 'రాయబారి' కోసం సరికొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో ఆయన గడ్డం, మీసాలతో విదేశీలాగా మారిపోయాడు. రామ్‌చరణ్ విషయానికి వస్తే తన తాజా చిత్రం 'తని ఒరువన్' రీమేక్ కోసం ఫ్రెంచ్ కట్‌తో, షార్ట్ హెయిర్‌తో అచ్చం పోలీసు ఆఫీసర్ పాత్రకు తగ్గట్లు తన గెటప్‌ను తీర్చిదిద్దుకుంటున్నాడు. ఇలా మన హీరోలందరూ ఇప్పుడు సినిమాకి సినిమాకి మధ్య వెరైటీగా కనిపించే పనిలో కసరత్తులు చేస్తున్నారు. మరి ఈ గెటప్‌లతో ఆయా హీరోలు ప్రేక్షకాభిమానులను ఏ స్థాయిలో అలరిస్తారో వేచిచూడాల్సివుంది...!