Advertisementt

అదృష్టం అంటే ఆమెదే..!

Tue 26th Jan 2016 02:06 PM
keerthi suresh,nenu sailaja,rajani murugan movie  అదృష్టం అంటే ఆమెదే..!
అదృష్టం అంటే ఆమెదే..!
Advertisement
Ads by CJ

మలయాళ భామ అయిన కీర్తిసురేష్‌కు అదృష్టం బాగా కలిసొస్తోంది. ఆమె డేట్స్‌ కోసం స్టార్‌ హీరోలు కూడా ఎదురుచూస్తున్నారు. ఒక నెలరోజుల్లోనే ఆమె దశ తిరిగిపోయింది. ఈ నెల రోజుల సమయంలో ఆమె చేసిన రెండు చిత్రాలు మంచి విజయాలను సాదించడంతో ఇప్పటివరకు మలయాళ పరిశ్రమకే పరిచయం అయిన ఆమెకు ఇప్పుడు టాలీవుడ్‌,కోలీవుడ్‌లలో ప్రేక్షకులను తన అందచందాలతో మెప్పించగలిగింది. తెలుగులో ఆమె హీరో రామ్‌ సరసన నటించిన 'నేను...శైలజ', తమిళంలో శివకార్తికేయన్‌ హీరోగా నటించిన 'రజనీమురుగన్‌'లు సూపర్‌హిట్‌ అయ్యాయి దాంతో ఇప్పుడు ఆమెకు కోలీవుడ్‌, టాలీవుడ్‌ల నుండి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. మహేష్‌బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రాబోయే చిత్రంలో ప్రముఖంగా ఆమె పేరు వినిపించింది. కానీ ఆ తర్వాత ఈ వార్తలను మురుగదాస్‌ కొట్టిపారేశాడు. తాము ఇంకా హీరోయిన్‌ని ఎంపికచేయలేదని చెప్పాడు. కానీ కీర్తిసురేష్‌ మాత్రం ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మహేష్‌-మురుగదాస్‌ల చిత్రంలో తనకు ఆ ఆఫర్‌ వచ్చింది అని చెప్పుకొచ్చింది. మరోవైపు కోలీవుడ్‌లో స్టార్‌ హీరో అయిన విజయ్‌ నటించే 60వ చిత్రానికి కీర్తిసురేష్‌ను ఎంచుకున్నట్లు యూనిట్‌ అఫీషియల్‌గా ప్రకటించింది. ఏదిఏమైనా ఆమెకు నేడు కాకపోతే రేపైనా స్టార్‌హీరోయిన్‌ అయ్యే లక్షణాలు బాగా ఉన్నాయని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ