Advertisementt

పూరీ మరలా మొదలెట్టాడు..!

Tue 26th Jan 2016 04:45 PM
purijagannath,rogue movie,ishan,pooja javeri  పూరీ మరలా మొదలెట్టాడు..!
పూరీ మరలా మొదలెట్టాడు..!
Advertisement
Ads by CJ

'లోఫర్‌' చిత్రం తర్వాత కొత్త హీరో అయిన ఇషాన్‌ను పరిచయం చేస్తూ కన్నడ, తెలుగు భాషల్లో పూరీజగన్నాథ్‌ 'రోగ్‌' చిత్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రాన్ని కొన్ని రోజులకే ఆపేశాడు పూరీ. స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడం, అంతేగాక తన వ్యక్తిగత టీంను బయటకు పంపేయడం, ఇలా పలు కారణాలతో ఈ చిత్రం ఆగిపోయింది. మొదట ఈ చిత్రానికి ఇషాశర్మను హీరోయిన్‌గా ఎంపికచేశాడు. ఆమెతో కొన్నిసీన్స్‌ కూడా చిత్రీకరించాడు. తాజాగా ఆమెను తీసేసి 'భమ్‌ బోలేనాథ్‌' భామ పూజాజవేరిని, సెకండ్‌ హీరోయిన్‌గా మన్నార్‌చోప్రాను తీసుకున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే బ్యాంకాక్‌లో ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని సమ్మర్‌ కానుకగా కన్నడ, తెలుగు భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నాడు. మరి పూరీ అనుకుంటే ఒక నెలలోనే షూటింగ్‌ పూర్తి చేయగలిగిన సత్తా ఉన్నవాడన్న సంగతి తెలిసిందే. కాగా 'లోఫర్‌' నిరాశపరిచిన సమయంలో ఈ 'రోగ్‌'తో అయిన పెద్ద హిట్‌ను కొట్టాలనే కసితో పూరీ ఉన్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ