మెల్లిమెల్లిగా తెలుగు సినిమా కార్పొరేట్ సంస్థల, మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో పేరొందిన సంస్థల చేతిలోకి వెళ్లిపోతుందా? అనే అనుమానం ఇప్పుడు అందరికీ కలుగుతోంది. ఇండివిడ్యువల్ ప్రొడ్యూసర్స్ తగ్గిపోయి, కార్పొరేట్ ఫండ్స్‌తో నడిచే సినిమాలు రావడమే దీనికి కారణం. టాలీవుడ్‌లో ప్రతి పెద్ద సినిమా వెనుక ఈరోస్ గానీ రిలయన్స్‌గానీ ఉంటోంది. వారి ముద్ర లేనిదే స్టార్స్ చిత్రాలు బయటకు రావడం లేదు. సంక్రాంతికి విడుదలైన 'డిక్టేటర్'కు ఈరోస్ ముద్ర ఉంటే, 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి రిలయన్స్ ముద్ర పడింది. ఇప్పుడు మరిన్ని ఈచిత్రాలకు ఈరోస్ ఇంటర్నేషనల్ ముద్ర తప్పడం లేదు. ఇక పవన్‌కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రానికి రిలయన్స్ ముద్రపడింది. కాగా తాజాగా ఆయన చేస్తున్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్'కు ఈరోస్ ముద్ర పడనుంది. ఈ సినిమాని కూడా ఈరోస్ సంస్థ సుమారు 70కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కాగా ఈ చిత్రం ఆడియో మార్చి 12న, సినిమా విడుదల మే 6వ తేదీన విడుదలవుతాయని సమాచారం.