ఖుషీ సినిమా పవన్ కళ్యాణ్ క్రేజుని అమాంతం ఆకాశానికి లేపుకుపోయింది. యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ ఈ మూవీ ద్వారా సెట్ చేసిన స్టైలిష్ మేనరిజమ్స్ అలాగే ఏళ్ళ తరబడి ఫాలో అయ్యారు అంటే ఎంత గట్టిగా వారి హృదయాల్లో ఖుషీ తిష్ట వేసుకు కూర్చుందో అర్థమవుతుంది. పాటలు, ఫైట్లు, రొమాన్స్, ఇలా అన్నింటిలోను దర్శకుడు సూర్య చూపిన ప్రతిభ తమిళం నుండి అరువు తెచ్చుకున్నదే అయినా పవర్ స్టారుకి పర్ఫెక్టుగా ఫిట్టయింది. ఎంతలా అంటే పవన్, సూర్య ఈ చిత్రంతో ది బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ప్రొఫెషనల్ హద్దులు దాటి పర్సనల్ విషయాల్లోనూ ఇద్దరూ అభిప్రాయాలు పంచుకునే దాకా వెళ్ళింది. అందుకే కొమరం పులితో మళ్ళీ వచ్చిన సూర్యకి కాదనలేకపోయాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా అడ్డంగా పోయినప్పటికీ వీరి మధ్య స్నేహం మాత్రం చెడలేదు. అందుకే ఇప్పుడు ఖుషీ సీక్వెల్ పేరిట పవన్, సూర్యలు కలిసి కొత్త చిత్రం కూడా ప్రారంభించబోతున్నారు. కానీ సూర్య ఏ మాత్రం ఫాంలో లేని అవుట్ డేటెడ్ దర్శకుడు. అటువంటి వారికి పిలిచి మరీ చాన్స్ ఇస్తున్నాడంటే, ఇది పవన్ కళ్యాణ్ కేవలం స్నేహం కోసం చేస్తున్నాడా లేక కథ, కథనాలు నచ్చి ఇస్తున్నాడా అన్నది ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వెళితే కానీ తేలే అంశం కాదు. పవన్ అంటేనే ఓ పాజిటివ్ థింకింగ్. సో, లేట్ అజ్ బీ పాజిటివ్ ఫర్ ఖుషీ 2.