Advertisementt

40కోట్ల క్లబ్‌లో సోగ్గాడు..!

Thu 28th Jan 2016 10:58 PM
soggade chinni nayana,nagarjuna,40crores club  40కోట్ల క్లబ్‌లో సోగ్గాడు..!
40కోట్ల క్లబ్‌లో సోగ్గాడు..!
Advertisement
Ads by CJ

సంక్రాంతికి విడుదలైన నాలుగు చిత్రాలలో బాక్సాఫీస్‌ రారాజు ఎవరో తేలిపోయింది. అది నాగార్జుననే అని అందరూ భావిస్తున్నారు. సంక్రాంతి సీజన్‌కు విడుదలైన నాలుగు చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ సాధించి మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మాత్రం నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' మాత్రమే. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు షేర్‌ వసూలు చేసింది ఈ చిత్రం. రివ్యూలపరంగా, మౌత్‌టాక్‌పరంగా ఎక్కువ రేటింగ్‌ వచ్చింది ఈ సినిమాకే. ఈ చిత్రాన్ని కేవలం 20కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు నిర్మాత కూడా నాగార్జునే కావడం ఆయనకు మరింత ప్లస్‌ అయింది. అంతేగాక ఈ చిత్రాన్ని ఆయన ఎక్కువ ఏరియాల్లో సొంతంగా రిలీజ్‌ చేసుకున్నాడు. కాగా ఈ చిత్రం ఇప్పటికే 40కోట్ల క్లబ్‌కు దరిదాపుల్లో ఉంది. ఇక శాటిలైట్‌ రైట్స్‌, ఇతర రైట్‌ వంటివి కలుపుకుంటే ఈ చిత్రం నాగ్‌కు కనీసం 50కోట్లు తెచ్చిపెడుతుందని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ