స్టార్ హీరో అవాలనుకున్న కల ఇంకా కలగానే మిగిలి ఉన్నా అల్లు శిరీష్ మాత్రం తనకు నచ్చిన పనిలో ఆనందాన్ని వెతుక్కోవడంలో అందరికన్నా ముందున్నాడు. ఐఫా ఉత్సవంలో షో మొత్తం హోస్ట్ చేసే పెద్ద భాద్యతని ఎంచుకున్న శిరీష్ ఈవెంట్ మొత్తానికి తన యాంకరింగ్ ద్వారా కొత్త ఎనర్జీని పంచాడు. నిజానికి బాలివుడ్ అంతటా ఏ ఫంక్షన్ జరిగినా స్టార్ హీరోలు, హీరోయిన్లే హోస్ట్ చేస్తుంటారు. అందరూ మిత్రులే కాబట్టి సందు దొరికిన ప్రతిసారీ తోటి హీరోల మీద, హీరోయిన్ల పైన ఫన్నీ సెటైర్లు వేస్తూ ఈవెంట్ మొత్తాన్ని రక్తి కట్టిస్తారు. ఈ పద్ధతి ఇంకా దక్షిణాదిలో మొదలవలేదు. కానీ ట్రెండ్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశ్యంతో అల్లు శిరీష్ ఐఫా ఉత్సవాన్ని హోస్ట్ చేసి అందరి మనసు దోచుకున్నాడు.
ముందుగానే స్టార్లకు ఫోన్ చేసి, ఫన్నీగా కొన్ని కామెంట్స్ చేస్తానని ఎవరూ ఫీలవద్దని చెప్పాను. అందరూ హ్యాపీగా ఒప్పుకున్నారు. ముఖ్యంగా చిరు మామయ్య, రవితేజ గార్లయితే సూపరుగా చేసావ్ అని అభినందించారు. ఈ ఈవెంట్ నాలో నిజమైన కాన్ఫిడెన్స్ పెంచింది అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు శిరీష్. అయ్య బాబోయ్ శిరీష్ బాబులో ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా దాగి ఉన్నాడు. కావాలంటే ఈ ప్రోగ్రాం మొత్తాన్ని తొందరలోనే టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారుగా చూడండి మనాడి కళాపోషణ.