టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత రెండు గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆర్భాటంగా ప్రకటించాడు. ఈ చిత్రం విడుదలై ఇటీవలే సిల్వర్‌జూబ్లీ (175రోజులు) పూర్తి చేసుకొంది. త్వరలో 200రోజులు కూడా పూర్తవుతాయి. అప్పుడు మహేష్ చేసిన దత్తత హడావుడి కేవలం తన సినిమాకు అదనపు ప్రచారం కోసమేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మహేష్ దత్తత తీసుకున్న గ్రామాల ప్రజలు మహేష్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిద్దాపూర్ గ్రామాస్తులైతే మహేష్ ఇప్పటివరకు తమ గ్రామానికి కూడా రాలేదని, కనీసం తమ బాగోగులు కూడా తెలుసుకోలేదని విమర్శిస్తున్నారు. మా గ్రామానికి ఎప్పుడు వస్తాడో? మా జీవితాలను ఆయన ఎప్పుడు బాగు చేస్తాడో తెలియటం లేదని మహేష్ దత్తత తీసుకున్న గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.