Advertisementt

మహేష్‌, శేఖర్‌కమ్ముల మూవీ ఫిక్స్‌ అయింది..!

Sat 30th Jan 2016 10:47 AM
mahesh babu,sekhar kammula,happy days,murugadoss  మహేష్‌, శేఖర్‌కమ్ముల మూవీ ఫిక్స్‌ అయింది..!
మహేష్‌, శేఖర్‌కమ్ముల మూవీ ఫిక్స్‌ అయింది..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహోత్సవం' చేస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్‌ 29న విడుదలకు సిద్దమవుతోంది. ఆ తదుపరి ఆయన మురుగదాస్‌ దర్శకత్వంలో దాదాపు 120కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీపొడక్షన్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. హరీశ్‌ జైరాజ్‌ ఇప్పటికే ట్యూన్స్‌ను కూడా సిద్దం చేశాడని సమాచారం. కాగా గతంలోనే మహేష్‌బాబు క్లాస్‌ అండ్‌ ఫీల్‌గుడ్‌ సినిమాల దర్శకుడు శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. మహేష్‌ మురుగదాస్‌ సినిమా పూర్తయ్యే సమయానికి శేఖర్‌కమ్ముల తాజాగా బాలీవుడ్‌లో చేయనున్న 'హ్యాపీడేస్‌' రీమేక్‌ కూడా పూర్తవుతుంది. మహేష్‌-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో చిత్రం పూర్తయ్యే సమయానికి మహేష్‌బాబుతో చేయబోయే స్టోరీని పక్కాగా శేఖర్‌కమ్ముల పూర్తి చేయనున్నాడు. కాగా ఈ చిత్రానికి మహేష్‌కు అత్యంత సన్నిహితుడైన జయంత్‌ సి.పరాన్జీ నిర్మాతగా వ్యవహరిస్తాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ