హీరోయిన్ ప్రణీత ప్రస్తుతం తీవ్రమైన అవమానకర పరిస్థితులు ఎదుర్కొంటోంది. అందుకు కారణం సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ఆమె తెలుగు టీమ్‌కు సపోర్ట్ చేయడమే. కన్నడభామ అయిన ప్రణీత తెలుగు టీమ్‌ను సపోర్ట్ చేయడాన్ని కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది కన్నడ పరిశ్రమను సపోర్ట్ చేసిన ప్రణీత ఈసారి పార్టీ మార్చిందంంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు కన్నడ అతివాదులు. సోషల్ మీడియాలో ఈమెపై అభ్యంతరకమైన...తీవ్రమైన వ్యాఖ్యలు వస్తుండటం అందులో కొన్ని వల్గర్‌గా ఉండటంతో ఈ అమ్మడు తీవ్రంగా కుమిలిపోతోంది. కొందరు తనను ద్రోహి అని అంటుండటంతో ఆమె కూడా తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది. ఏ టీమ్‌ను సపోర్ట్ చేయాలనేది నా చేతిలో ఉండదు. అలాంటి అవకాశం గనుక ఉంటే నేను అందరినీ సపోర్ట్ చేస్తాను.. అంటూ సమాధానం ఇచ్చింది. ఇలాంటి పరిస్థితి పగ హీరోయిన్‌కు కూడా రాకూడదని మదనపడుతోంది ఈ బాపుబొమ్మ. ఆమె ప్రస్తుతం ఆది హీరోగా తెరకెక్కుతోన్న 'చుట్టాలబ్బాయ్', మహేష్ నటిస్తున్న 'బ్రహ్మూెత్సవం' సినిమాల్లో నటిస్తోంది.