Advertisementt

పవన్‌ స్టామినా ఇది..!

Sat 30th Jan 2016 08:47 PM
pawan kalyan,sardhar gabbar singh,eros international,100 crores market  పవన్‌ స్టామినా ఇది..!
పవన్‌ స్టామినా ఇది..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద పవన్‌ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో రాబోతున్న పవన్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం బిజినెస్‌ 100కోట్ల మార్క్‌ను అందుకోవడం ఖాయం అంటున్నారు. పవర్‌స్టార్‌ ఇంతకు ముందు నటించిన రికార్డ్‌ బ్రేకింగ్‌ మూవీ 'అత్తారింటికి దారేది' చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పట్లో కేవలం థియేటర్‌ బిజినెస్‌ పరంగానే 75కోట్లఈ మార్కును అందుకున్న తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో 'సర్దార్‌' చిత్రం బిజినెస్‌ అంతకంటే ఎక్కువే ఉంటుందని అంటున్నారు. ఇప్పటి అంచనాల ప్రకారం 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' థియేటర్ల్‌ ద్వారా 70కోట్ల వరకు ఉండటం ఖాయమని తేలిపోయింది. ఆల్‌రెడీ 70కోట్లకు ఈ చిత్రం థియేటికల్‌ రైట్స్‌ను ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సొంతం చేసుకుంది. ఇక శాటిలైట్‌, ఓవర్‌సీస్‌, ఆడియో రైట్స్‌.. ఇతర రైట్స్‌ అన్ని కలిపితే ఈ చిత్రం 100కోట్ల మార్క్‌ను అందుకోవడం ఖాయం అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ