సంక్రాంతి సంబరం తరువాత ఓ వారం గ్యాప్ తీసుకొని ఈ వారం పోటీ మీద విడుదలైన నాలుగు చిత్రాలకు గొప్ప టాకేమీ రాలేదు. ఉన్నవాటిలో కళావతి కాస్తంత బెటర్ అని తెలిసిపోయింది. అంతేకాక రాజ్ తరుణ్ చేసిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతోంది. ఇక లచ్చిందేవికి లక్ష్మీ కటాక్షం శూన్యం. నయనతార నేను రౌడీనే ఫర్వాలేదు బాగానే ఉన్నా, మినిమమ్ ప్రమోషన్స్ కూడా లేకుంటే జనానికి తెలిసేది ఎట్లా. అందుకే జనాలు ఇంకా సంక్రాంతి సినిమాలకే మొగ్గు చూపుతున్నారు. ఆదివారం అంటే రేపటి వరకు పై నాలుగు సినిమాలనకు కొద్దో గొప్పో వసూళ్లు వచ్చినా సోమవారం నుండి మళ్ళీ కథ మొదటికే వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత జరుగుతుంటే మరి లాభపడేది ఎవరయ్యా అంటే మళ్ళీ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనే అంటున్నారు. నిన్న, ఈరోజు కూడా సంక్రాంతి చిత్రాలలో నిజంగా కళకళలాడుతున్న సినిమా హాళ్ళు ఏవైనా ఉన్నాయా అంటే అవి సోగ్గాడివే. అన్ని కలిసొచ్చాయి కాబట్టే నాగార్జున ఇంక నిలబడిపోయాడు.