అక్షయ్‌కుమార్.. ఈయన ప్రస్తుతం దక్షిణాదిలో శంకర్-సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'రోబో 2.0' చిత్రంలో విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా గతంలో అక్షయ్ కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నెగటివ్ రోల్స్ చేసినప్పటికీ అవి పూర్తి స్థాయి విలన్ పాత్రలు కావు. దాంతో తాను తొలిసారిగా పూర్తి స్థాయి విలన్ పాత్రను పోషిస్తున్న 'రోబో2.0' చిత్రంలో నటిస్తున్నాడు. కాగా అక్షయ్ ఈ చిత్రం షూటింగ్‌లో మార్చి నుంచి పాల్గొంటాడు. ఈ విషయమై అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ.. శంకర్ గారి మీద ఉన్న నమ్మకం.. సూపర్‌స్టార్ రజనీకాంత్ గారంటే ఉన్న అభిమానంతో ఈ చిత్రంలో విలన్‌గా చేయడానికి ఒప్పుకున్నాను. అయినా పూర్థిస్థాయి విలన్‌గా నటించడం అనుకున్నంత ఈజీ కాదని నాకుతెలుసు. వాస్తవానికి రజనీకాంత్ చిత్రంలో ఆయనకు నెగటివ్ పాత్ర చేయాలంటే భయమేస్తోంది. నాకు రజనీకాంత్ అంటే ఎంతో భయం. అయినా నా శక్తిమేర నేను ఈ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను.. అని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ఇప్పటికే రజనీతో నటించడం అంటే భయపడుతున్న అక్షయ్.. రజనీతోపాటు ఢీకొనే సన్నివేశాలంటే మరెంత భయపడతాడో...? అని బాలీవుడ్ మీడియా ఈ విషయాన్ని గుర్తు చేసింది.