Advertisementt

మహేష్‌ కి ఎన్టీఆర్ పోటీగా వస్తున్నాడు!

Mon 01st Feb 2016 12:51 PM
nannaku prematho,jr ntr,mahesh babu,overseas,janata garage  మహేష్‌ కి ఎన్టీఆర్ పోటీగా వస్తున్నాడు!
మహేష్‌ కి ఎన్టీఆర్ పోటీగా వస్తున్నాడు!
Advertisement
Ads by CJ

సినిమా టాక్‌ ఎలా ఉన్నా సరే.. ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో చేసిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం మంచి కలెక్షన్లను ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో 13కోట్లు వసూలు చేసింది. ఇంతకు ముందు ఎన్టీఆర్‌ నటించిన 'బాద్‌షా, టెంపర్‌' చిత్రాలు కూడా యుఎస్‌లో మిలియన్‌ మార్క్‌ను దాటాయి. ఇలా మిలియన్‌ మార్క్‌ను అందుకొన్న మూడోచిత్రంగా ఎన్టీఆర్‌ పేరు రికార్డులకు ఎక్కింది. కాగా తాను త్వరలో కొరటాల శివతో చేయబోయే 'జనతాగ్యారేజ్‌' షూటింగ్‌ మొదలుపెట్టడానికి ముందే ఓవర్‌సీస్‌లో  భారీ ధరకు అమ్ముడైంది. ఈ చిత్రంతో ఎన్టీఆర్‌ మరోసారి ఓవర్‌సీస్‌ మార్కెట్‌ను దున్నేయడం ఖాయం అని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. ఇక ఇప్పటివరకు మహేష్‌బాబు సినిమాలు ఓవర్‌సీస్‌లో ఐదుసార్లు మిలియన్‌ మార్క్‌ను దాటాయి. ఆ విషయంలో ఎన్టీఆర్‌ మహేష్‌బాబుకు పోటీగా మారుతున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్‌కు కూడా ఓవర్‌సీస్‌లో అద్భుతమైన కలెక్షన్లు, క్రేజ్‌, ఇమేజ్‌ రావడం ఆయనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ