తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన మహాసభ రసాభాస కావడంతో పవన్ కళ్యాణ్ హుటాహుటిన కేరళలో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ విడిచి హైదరాబాద్ పయనం అయ్యారు. ఈ రోజు సాయంత్రం ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి ఉదంతం పైన తన వాణిని వినిపించే ప్రయత్నం చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించాక చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో ఎన్నో కొత్త ప్రక్రియలు మొదలయ్యాయి. వీటిలో కొన్ని విమర్శలు పాలయినా, తన పాలనాదక్షతతో నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడొచ్చిన కాపు కుల సమస్య మాత్రం వాటి అన్నింటికీ భిన్నం. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా కాపు కులస్తుడే కావడం చేత మరి మీడియా ముందు ఏం మాట్లాడతారా అన్నది అందరి మదిని తొలిచే ప్రశ్న. కాపులకు బాసటగా ఉంటారా లేక నాయుడుతో దోస్తీని ముందేస్తారా? ఇప్పుడు పవన్ చేసేది అసలైన కత్తి మీద సాము... సారీ క్షమించాలి, కులం మీద సాము. చిరంజీవి తరువాత కాపు కులంలో లీడర్ గుణాలు చక్కగా ఉన్న అతిబలమైన శక్తి పవన్ కళ్యాణ్. మరి అందివచ్చిన ఈ అవకాశాన్ని పవన్ ఎలా తనకు అనుగుణంగా మార్చుకుంటాడు అన్నది నేటి సాయంత్రం వరకు కొనసాగే అనిశ్చితే!