Advertisementt

పాత రూటులోకి వెంకీ..!

Tue 02nd Feb 2016 05:52 PM
venkatesh,family entertaining movies,babu bangaram movie,maruthi  పాత రూటులోకి వెంకీ..!
పాత రూటులోకి వెంకీ..!
Advertisement
Ads by CJ

అభిమానులకు భారీగా బాకీ పడిపోయాడు విక్టరీ వెంకటేష్‌. ఆ లోటును మారుతి సినిమాతో తీర్చడానికి రెడీ అవుతున్నాడు ఆయన. వాస్తవానికి వెంకీకి ఫ్యామిలీ ప్లస్‌ కామెడీ చాలా బలం. ఈ మధ్యకాలంలో వెంకీ కామెడీ చిత్రాలు చేయలేదు. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, దృశ్యం, గోపాల గోపాల' వీటన్నింటిలో వెంకీ పాత్రలు సీరియస్‌గానే సాగాయి. ఆయన చేసిన చివరి ఫ్యామిలీ అండ్‌ కామెడీ అంతర్లీనంగా ఉండే చిత్రం 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే'. ఈ చిత్రం తర్వాత ఆయనకు సరైన కామెడీ హిట్‌ పడలేదు. ఇప్పుడు ఆయన మారుతి దర్శకత్వంలో వెంకటేష్‌-నయనతారల కాంబినేషన్‌లో చేస్తున్న 'బాబు బంగారం' చిత్రం పక్కా ఫ్యామిలీ అండ్‌ కామెడీ చిత్రం కావడం గమనార్హం. ఈ విధంగా ఆయన ఆ లోటును మారుతి సినిమాతో నెరవేర్చి, కంటతడి, కితకితలు పెట్టనున్నాడు. మరి ఈ చిత్రం వెంకీకి ఎంతటి ఘనవిజయం అందిస్తుందో వేచిచూడాల్సివుంది....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ