Advertisementt

మరో సంచలనానికి తెరతీస్తున్న వర్మ..!

Wed 03rd Feb 2016 08:57 AM
ram gopal varma,killing veerappan,davoodh ibrahim  మరో సంచలనానికి తెరతీస్తున్న వర్మ..!
మరో సంచలనానికి తెరతీస్తున్న వర్మ..!
Advertisement
Ads by CJ

విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో వంగవీటి మోహనరంగా జీవిత చరిత్రను తెరకెక్కిస్తానంటూ ప్రకటించిన వర్మ ఇప్పుడు మరో కాంట్రవర్శీ సినిమాను టైటిల్‌తో సహా ప్రకటించేశాడు. దాంతో ఆయన ముంబై వెళ్లి చేయనున్న సినిమాపై ఓ క్లారీటీ వచ్చింది. వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా కన్నడ, తెలుగు భాషల్లో ఇటీవల తెరకెక్కించిన 'కిల్లింగ్‌ వీరప్పన్‌' హిట్‌తో వర్మ మరలా ఫామ్‌లోకి వచ్చాడు. ఆ ఊపులో అదే తరహాలో దావూద్‌ఇబ్రహీం, చోటారాజన్‌ జీవితంపై ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే ఈ చిత్రానికి 'గవర్నమెంట్‌' అనే టైటిల్‌ను కూడా ప్రకటించేశాడు. ఈ చిత్రం వాస్తవాలకు చాలా దగ్గరగా ఉంటుందని చెబుతున్నాడు. వీరప్పన్‌ అంటే బతికిలేడు కాబట్టి ఆయన సినిమా ఎలా తీసినా సమస్య పెద్దగా రాలేదు. అదే ప్రపంచాన్ని వణికించిన మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితంపై అదే తరహాలో సినిమా తీస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అని అందరూ భయపడుతున్నారు. 'కిల్లింగ్‌ వీరప్పన్‌' లో వీరప్పన్‌ పాత్రను ఎలా చూపించాడో ఇందులోనూ దావూద్‌, చోటారాజన్‌, అబు సలీం, చోటాషకీల్‌ తదితరులను అదే విధంగా వాస్తవికతకు దగ్గరగా చూపించబోతున్నట్లు ఆయన చెబుతున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ