ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రం ఇప్పటికే బిజినెస్‌పరంగా అదరగొడుతోంది. ఈ చిత్రం సీడెడ్‌లో 10.5 కోట్లకు అమ్ముడైంది. 'అత్తారింటికి దారేది' చిత్రం ఇక్కడ 8కోట్లకు అమ్ముడైంది. ఇప్పుడు ఈ చిత్రం రికార్డ్‌ను మరలా పవన్ తన చిత్రంతోనే క్రాస్ చేశాడు. ఇక ఈ చిత్రాన్ని నైజాం, ఓవర్‌సీస్‌లో ఈరోస్ సంస్థ స్వయంగా విడుదల చేయనుంది. ఇక గుంటూరు 6.5కోట్లకు , కృష్ణా 4.25 కోట్లకు, నెల్లూరు 3.25కోట్లకు, వైజాగ్ 7.2కోట్లకు, తూర్పుగోదావరి 6.2కోట్లకు, పశ్చిమగోదావరి 4.65కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. కాగా ఈ చిత్రం ఆడియో మార్చి 12న జరుగనుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవన్‌కళ్యాణ్‌లకు మధ్య సరైన సంబంధాలు లేవని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల చిరు 'సర్దార్' సెట్స్‌కి వెళ్లి దాదాపు రెండు గంటలు గడిపిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌లకు అభిప్రాయ బేధాలు ఉన్నాయనే వార్తను ఖండించే విధంగా 'సర్దార్ గబ్బర్‌సింగ్' ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించాడని, అందుకు చిరు కూడా అంగీకారం తెలిపాడని సమాచారం.