ప్లానింగ్ అంటే అది తమన్నాదే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇటు చిన్నహీరోలతో చిందులేయడానికి, అటు స్టార్స్‌తో రొమాన్స్ చేయడానికి కూడా ఆమె ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది. ఇటు ప్రభాస్, రవితేజ, కార్తీ వంటి స్టార్స్ సరసన నటిస్తూనే మరోపక్క బెల్లంకొండ శ్రీనివాస్ వంటి కొత్తహీరోతో 'అల్లుడు శీను'లో చిందులేసింది. తాజాగా రూపొందుతున్న శ్రీనివాస్ రెండో చిత్రం 'స్పీడున్నోడు'లో కూడా ఆమె మరోసారి ఈ యంగ్‌హీరోతో స్టెప్‌లేసింది. ఇగోలను పక్కనపెట్టి తానేంటి తన స్టార్‌డమ్ ఏమిటి? ఈ కుర్రహీరోలతో నాకేం పని? అనే వాటిని ఆమె పక్కన పెట్టడంతో ఆమె ఇటు టాలీవుడ్‌లోనే కాదు.. కోలీవుడ్‌లో కూడా దూసుకువెళ్తోంది. తాజాగా ఆమె విజయ్ సేతుపతి వంటి అప్‌కమింగ్ హీరోతో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఇలా అందరినీ మాయచేస్తోన్న ఆమె ప్రభుదేవాతో కూడా కలిసి నటించనున్న సంగతి తెలిసిందే. ఇలా తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ బిజీగా ఉంటోంది ఈ మిల్కీబ్యూటీ. మొత్తానికి ఆమె ఫాలో అవుతున్న రూట్ సరైనదే అని విశ్లేషకుల తేల్చేస్తున్నారు.