Advertisementt

రేవతి చేతిలో 'క్వీన్'.!

Fri 05th Feb 2016 04:11 PM
revathi,bollywood queen movie,vishnu vardhan,  రేవతి చేతిలో 'క్వీన్'.!
రేవతి చేతిలో 'క్వీన్'.!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన చిత్రం 'క్వీన్‌'. ఈ సినిమాని దక్షిణాది భాషల్లో రీమేక్‌ చేయడానికి రీమేక్‌ హక్కులను ప్రముఖ తమిళ హీరో ప్రశాంత్‌ తండ్రి విష్ణువర్థన్‌ పొందివున్నాడు. ఆయన ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని ఎప్పటినుండో ప్రయత్తిస్తున్నప్పటికీ సరైన నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరకపోవడంతో ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా డైరెక్షన్‌ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. సీనియర్‌ నటి రేవతి చేతిలో ఈ సినిమాను పెట్టాలని త్యాగరాజన్‌ భావిస్తున్నాడట. ఈమేరకు రేవతితో చర్చలు జరపడం, డైరెక్షన్‌కు ఆమె అంగీకరించడం జరిగిపోయిందని కోలీవుడ్‌ టాక్‌. రేవతి ఇదివరకు ఓ నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించింది. అయితే ఎటొచ్చి ఈ సినిమాకి హీరోయినే పెద్ద సమస్యగా మారింది. మరి హీరోయిన్‌ ఎంపిక ఎప్పటికి పూర్తవుతుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ