నాని, హను రాఘవపూడి కలయికలో వస్తున్న కృష్ణగాడి వీర ప్రేమగాధకి అన్నీ శుభ శకునాలే ఎదురవుతున్నాయి. ట్రైలర్ విడుదలైంది మొదలు, నాని లుక్కుకి, ట్రైలర్లో చూపించిన కంటెంటుకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే భలే భలే మగాడివోయ్ బాక్సాఫీస్ దగ్గర చేసిన విజయ విహారం వల్ల నాని ఈ మూవీతో పంచిన స్వీట్ మెమొరీస్ జనాలని ఇంకా సరదాగా నవ్విస్తూనే ఉన్నాయి. సో, భలే ప్రభావం తప్పకుండా కృష్ణగాడి ఓపెనింగ్స్ మీద ఉంటుంది. పైగా ఈ వారం అండ్ పోయిన వారం విడుదలయిన చిన్నా చితకా సినిమాలు ఎంత మాత్రం నిలబడలేని పరిస్థితి కనిపిస్తోంది. వీటన్నింటి పర్యవసానం కృష్ణగాడికి అదృష్టం కలిసొచ్చేలా చేసేట్టు ఉంది. నిర్మాణ సంస్థ 14 రీల్స్ కూడా ప్రమోషన్లలో దూసుకుపోతున్న వైనం చూస్తుంటే ఓ మోస్తారు పాజిటివ్ ఓపెనింగ్ టాక్ సాధించినా నాని చిత్రానికి జనాలు పట్టం కట్టేట్టు ఉన్నారు. వీటి తోడు రిలీజు కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని టాక్. భలే భలేగా నాని తన విన్నింగ్ టచ్ కొనసాగించాలని కోరుకుందాం.