బెంగళూరు డేస్ అనే మలయాళం సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. మాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రనే తిరగరాసిన ఈ ఫీల్ గుడ్ చిత్రం రీమేక్ రైట్స్ కోసం ఎందఱో నిర్మాతలు ఎగబడినా PVP సంస్థ ఎట్టకేలకు తమిళంలో రీమేక్ చేసి బెంగుళూరు నాట్కల్ పేరుతో నిన్నే విడుదల చేసారు. దగ్గుబాటి రానా, శ్రీ దివ్య, ఆర్య, బాబీ సింహ, సమంతా ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకులు బాగానే స్పందించారు. ముఖ్యంగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మలయాళంలో ఉన్న ఎమోషన్ మొత్తాన్ని తెర మీద క్యారీ చేయటంలో చాలా వరకు ఉత్తీర్ణుడయ్యాడని అంటున్నారు. ఇంత మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా తమ మాతృభాషలో అందించి ఉంటె మరింత ఆనందంగా ఉండేది అన్న ఫీలింగ్ ఉన్నప్పట్టికీ, సదరు నిర్మాణ సంస్థ మరి ఈ తమిళ వెర్షన్ డబ్బింగ్ పూర్తి చేసి తెలుగులో విడుదల చేస్తుందా లేక మొత్తంగా మెయిన్ క్యాస్టింగ్ మార్చేసి సాంతం రీమేక్ చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. అందుకే టాలివుడ్ మూవీ లవర్స్ అందరూ, మాకు లేవా బెంగళూరు డేస్ అంటూ PVPని ప్రశ్నిస్తున్నారు. నిజానికి వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్ రాజు, PVP సంయుక్తంగా తెలుగు వెర్షన్ మొదలెట్టినప్పటికీ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఇప్పుడైనా తెలుగు వర్షనుకు మోక్షం వస్తుందో లేదో వెయిట్ అండ్ సి.