Advertisementt

ఇక, పవన్ కళ్యాణ్ చుట్టేస్తున్నాడండోయ్!

Sun 07th Feb 2016 10:14 PM
pawan kalyan,sadaar gabbar singh,april 8 release  ఇక, పవన్ కళ్యాణ్ చుట్టేస్తున్నాడండోయ్!
ఇక, పవన్ కళ్యాణ్ చుట్టేస్తున్నాడండోయ్!
Advertisement
Ads by CJ

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పక్కాగా ఏప్రిల్ 8కి వస్తోందని అఫీశియలుగా మెసేజ్ పెట్టేసారు నిర్మాతలు. మామయ్యకు నేను అసలు అడ్డే కాదు అనిపించేలా అదే తారీఖున మొదటగా రావాలనుకున్న అల్లు అర్జున్ సరైనోడు కనీసం రెండు వారాలు వెనక్కి వెళ్లనుందని సమాచారం. అంటే చచ్చీచెడీ ఏప్రిల్ 8 కల్లా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం అన్ని అడ్డంకులు దాటుకొని థియేటర్స్ లోనికి రావాల్సిందే. దీని కోసం షూటింగ్  స్పీడు పెంచటమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జోరందుకోవాలి. నిజానికి జనవరి నెలాఖరు వరకు నలభై, యాభై శాతాన్ని మించి షూటింగ్ అవలేదు అని ఓ వార్త. పాటలు, పోరాటాలు చాలా వరకు పెండింగ్ ఉన్నాయని తెలిసింది. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు చక్కదిద్దాల్సిన రాజకీయాలు కూడా ఉండడంతో ఒక్క ఉదుటున షెడ్యూలు మొత్తం సాఫీగా కంప్లీట్ చేసింది ఎప్పుడూ లేదు. మరి అలాంటప్పుడు ఏప్రిల్ సెకండ్ వీక్ రిలీజ్ అన్న తేదీని అనౌన్స్ చేసారు అంటే లోగుట్టు ఏంటో తెలియకుండా ఉంటుందా. అవును, పవన్ కళ్యాణ్ గారు దర్శకుడు బాబీ సహకారంతో ఆగమేఘాల మీద సినిమాను చుట్టేస్తున్నారని టాక్. ఈ చుట్టడంతో ఎంతవరకు ప్రోడక్ట్ క్వాలిటీ దెబ్బ తింటుందో అన్న బెంగ అభిమానుల్లో ఉన్నా గత్యంతరం లేకనే అనుకున్న తేదీకి రావాలన్న తపన కొద్దే అంతా జరుగుతోంది అంటున్నాయి సినిమా వర్గాలు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ