Advertisementt

విలన్ వేషాలు వేస్తున్న దర్శకుడు!

Mon 08th Feb 2016 11:23 AM
lawrence,jigarthanda 2  విలన్ వేషాలు వేస్తున్న దర్శకుడు!
విలన్ వేషాలు వేస్తున్న దర్శకుడు!
Advertisement
Ads by CJ

లారెన్స్ అంటే ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్, అటు తరువాత హీరో అండ్ అటు తరువాత దర్శకుడు కూడా. సినిమాకు సంబంధించి సకల కళలను అవపోసన పట్టిన లారెన్స్ ఇప్పుడు కొత్తగా విలన్ అవతారం ఎత్తబోతున్నాడు. అవును, లారెన్స్ నటన గూర్చి మనకు తెలియనిది కాదు. ఏ పాత్రను ఇచ్చినా అవలీలగా పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఉన్న నటుడు. ఒక్క సూపర్ హిట్ ముని సిరీస్ గమనిస్తే చాలు లారెన్స్ విషయం యిట్టె అర్థమవుతుంది. అందుకే ఈ యాక్టింగ్ టాలెంట్ చూసిన ఓ తమిళ దర్శకుడు మనాడికి ప్రతినాయకుడు వేషం కట్టబెట్టాడు. అతను ఎవరో కాడు, పిజ్జా అండ్ జిగర్‌ తాండా లాంటి మంచి సినిమాలు తీసిన దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌. ప్రస్తుతం జిగర్‌ తాండాకు సీక్వెల్‌ చేస్తున్న కార్తీక్ ఈ సినిమాలో విలక్షణమైన విలన్‌ పాత్రకు లారెన్స్‌ను ఎంచుకున్నాడు. ఇందుకోసం సరికొత్త గెటప్పు కూడా రెడీ చేసారట. అతి త్వరలో ఈ మూవీ షూటింగులో పాల్గొనబోతున్న లారెన్స్ తాను చేసిన అన్ని పాత్రల్లోకెల్లా ఇది కిక్కింగ్ అనుభవం అంటున్నాడు. వీటికి తోడు లారెన్స్ చేస్తున్న మొట్ట శివ కెట్ట శివ, ముని సిరీస్ 4వ భాగం కూడా లైన్లో ఉన్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ