తన వయసుకు, ఇమేజికి తగ్గ కథ దొరకాలని, మరీ ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 150వ చిత్రం అవడం చేత చాలా పకడ్బందీగా చిరంజీవి గారికి తమిళ కత్తిని రీమేక్ చేస్తున్నారు దర్శకుడు వీవీ వినాయక్. కథానుసారం మాతృకలో వచ్చే ప్రతి పాత్రని, కథనంలో ఉండే నిజాయితీని తెలుగులో ఒడిసి పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే మొత్తం స్క్రిప్టుని పునర్లిఖించడానికి సీనియర్ మోస్ట్ రచయితలను సైతం పనిలో పెట్టేసారు మెగా ఫ్యామిలీ. కత్తిలో విజయ్ డ్యుయల్ రోల్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇందులో మొదట్లో వచ్చే కత్తిరేషన్ పాత్రకు ఓ రొమాంటిక్ ట్రాక్ వేసి సమంతాను హీరోయినుగా పెట్టేసి కాసింత మసాలా కలిపారు మురుగదాస్. తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి ఇమేజిని దృష్టిలో పెట్టుకుని మరీ ఈ వయసులో యంగ్ లవ్ ట్రాక్ వేస్తే బాగోదని, దీనికి బదులుగా పల్లెటూరి నుండి సిటీకి వచ్చిన ఓ అమాయక రైతుగా, నేటి రైతుల కష్టాన్ని ప్రతిబింబించే త్రెడ్ ఒకటి తయారు చేస్తున్నారని సమాచారం. ఫస్టాఫ్ అంతా కాస్తంత ఫన్ మిస్ అవకుండా, సినిమా టేకాఫ్ ఎటువంటి ఒడిదొడుకులకు గురి కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కత్తి కథకు కొత్త హంగులు అద్దుతున్నారని అసలు విషయం. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం నిజంగా మెగా 150వ చిత్రానికి మంచి పరిణామం అనే చెప్పుకోవాలి.