సంక్రాంతి సినిమాగా విడుదలై సూపర్‌హిట్ సాధించిన సోగ్గాడే చిన్ని నాయనా నాగార్జున కెరీర్‌లోనే అత్యధికంగా కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు క్యారెక్టర్ అందర్నీ ఎంటర్‌టైన్ చేసింది. అంతేకాదు తనకు ఎంతగానో నచ్చిన క్యారెక్టర్ బంగార్రాజు అని నాగార్జున అన్ని ఇంటర్వ్యూలలో చెప్తూ వస్తున్నాడు. చాలా కాలం తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు నేటివిటీతో నాగార్జున చేసిన ఈ సినిమాపై అతనికి ప్రేమ మరింత ఎక్కువైనట్టుంది. అందుకే ఈ చిత్రంలో తనకు నచ్చిన బంగార్రాజు టైటిల్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో రిజిష్టర్ చేశాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో నెక్స్‌ట్ రాబోయే చిత్రం ఇదేనని తెలుస్తోంది. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించిన కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చెయ్యబోతున్నానని ఇంతకుముందు ప్రకటించిన నాగార్జున.. బంగార్రాజు అనే పేరుతోనే ఆ సినిమా చెయ్యబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో నాగార్జున నటిస్తాడా? లేక ఇద్దరు కొడుకుల్లో ఒకరికి ఛాన్స్ ఇస్తాడా అనేది తెలియాల్సి వుంది.