Advertisementt

రీమిక్స్‌కి రెడీ అవుతున్న పూరి జగన్నాథ్‌!

Mon 08th Feb 2016 11:57 AM
director puri jagannath,puri jagannath next movie with kalyan ram,puri jagannath movie with ntr,puri jagannath new movie title remix,puri jagannath remix with new talent  రీమిక్స్‌కి రెడీ అవుతున్న పూరి జగన్నాథ్‌!
రీమిక్స్‌కి రెడీ అవుతున్న పూరి జగన్నాథ్‌!
Advertisement
Ads by CJ

పూరి జగన్నాథ్‌ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్సే కాదు టైటిల్స్‌ కూడా విచిత్రంగా వుంటాయి. ఇప్పటివరకు పూరి చేసిన సినిమాల టైటిల్స్‌ అన్నీ డిఫరెంట్‌గానూ, అందరూ డిస్కస్‌ చేసుకునే విధంగానే పెట్టాడు. రీమిక్స్‌ అనే డిఫరెంట్‌ టైటిల్‌ని రిజిష్టర్‌ చేశాడు. వైష్ణో అకాడమీ బేనర్‌లో మంచి హిట్‌ సినిమాలు చేసిన పూరి అదే బేనర్‌లో ఈ టైటిల్‌ని రిజిస్టర్‌ చేయించాడు. 

ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో కళ్యాణ్‌రామ్‌ హీరోగా ఓ సినిమా చెయ్యబోతున్న పూరి, ఎన్టీఆర్‌ హీరోగా కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల సబ్జెక్ట్స్‌ని ఒకేరోజు ఒకే సిట్టింగ్‌లో ఓకే చేయించుకొని ఒక రేర్‌ రికార్డ్‌ని సొంతం చేసుకున్న పూరి ఈ రెండు సినిమాల తర్వాత రీమిక్స్‌ చిత్రాన్ని చేస్తాడని తెలుస్తోంది. ఇప్పటివరకు అంతా కొత్తవారితో సినిమా చెయ్యని పూరి జగన్నాథ్‌ రీమిక్స్‌ చిత్రం ద్వారా కొత్త ఆర్టిస్టుల్ని పరిచయం చెయ్యబోతున్నాడట. ఈ చిత్రానికి సంబంధించిన డీటైల్స్‌ త్వరలోనే తెలుస్తాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ