వైవిధ్యభరితమైన చిత్రాలను చేస్తోన్న నారా రోహిత్‌కు ఇప్పటివరకు ఓ సూపర్‌హిట్ కూడా లేదు. ఆ లోటును 'తుంటరి' చిత్రం తీరుస్తుందని నారా రోహిత్ ఎంతో ఆశతో ఉన్నాడు. సాధారణంగా కమర్షియల్ సినిమాలతో తెరంగేట్రం చేయాలని దర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కానీ తన మొదటి చిత్రాన్నే వైవిధ్యమైన కథను తీసుకొని ఫీల్‌గుడ్ మూవీగా 'గుండెల్లో గోదారి' తెరకెక్కించి దర్శకునిగా మారిన కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో 'తుంటరి' వస్తుండటంతో ఇప్పుడు అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. కాగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‌లో నారా రోహిత్‌ను చూపించిన తీరు, మెయిన్‌గా బాక్సర్‌గా ఆయన్ను ప్రెజెంట్ చేసిన తీరు ద్రిల్లింగ్‌గా ఉన్నాయి. కాగా ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ముగించుకొని పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇందులో లతాహెగ్డే నారారోహిత్ సరసన నటిస్తోంది. 'జిల్' ఫేమ్ కబీర్‌సింగ్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం మార్చిలో విడుదలకు సిద్దమవుతోంది.